తాజ్‌మహల్‌ వద్దకు ట్రంప్..కోతుల బెడద

6 నెలలుగా పర్యాటకులను ఇబ్బంది పెడుతున్న కోతులు

monkeys-taj-mahal
monkeys-taj-mahal

ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ 24న భారత్‌ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. అయితే, అక్కడ కోతుల బెడద అధికమైంది. ఆరు నెలలుగా కోతులు పర్యాటకులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తమ చేతుల్లోని వస్తువులను కోతులు లాక్కెళుతున్నాయంటూ పర్యాటకులు వాపోతున్నారు. ఈ సమయంలో అక్కడకు ట్రంప్ వెళితే ఆయన పర్యటనకు కూడా కోతులు అంతరాయం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమాండెంట్ బ్రిజ్ భూషణ్ భద్రతా ఏర్పాట్లలో భాగంగా దీనిపై కూడా దృష్టి పెట్టారు. కోతుల బెడద లేకుండా భద్రతాధికారులు చర్యలు తీసుకునే అవకాశముంది. కాగా, 24న ట్రంప్ తాజ్‌మహల్‌ను సందర్శించనున్న నేపథ్యంలో ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సందర్శకులను అనుమతించరు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/