తెలుగు రాష్ట్రాలలో మెడికవర్‌ భారీ పెట్టుబడులు

నెల్లూరులో 250 బెడ్స్‌ హాస్సిటల్‌ను ప్రారంభించింది

medicover hospitals
medicover hospitals

నెల్లూరు: ఐరోపాకు చెందిన ఆరోగ్య, వైద్య పరీక్షల సంస్థ మెడికవర్‌ గ్లోబల్‌ తెలుగు రాష్ట్రాలలో మరిన్ని ఆసుపత్రులను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ హాస్పిటల్‌ను నిర్వహిస్తోన్న ఈ సంస్థ తాజాగా నెల్లూరులో 250 బెడ్స్‌ హాస్పిటల్‌ను ప్రారంభించింది. 100 పడకలతో అంతర్జాతీయ స్థాయి క్యాన్సర్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతుంది. మెడికవర్‌ సంస్థ దేశీయంగా ఈక్విటీ, డెట్‌ రూపాల్లో రూ. 700 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది. క్యాన్సర్‌ ఆసుపత్రి సహా ఇతర ప్రాజెక్ట్సు కోసం మరో రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మెడికవర్‌ సీఈవో ప్రెడ్రిక్‌ రాగ్‌ మార్గ్‌ పేర్కొన్నారు. 2020 డిసెంబర్‌ లోగా హైదరాబాద్‌లో 500 బెడ్స్‌ తీసుకునే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/