ఈనెల చివర్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగొచ్చు

వార్షిక బడ్జెట్ సమావేశాలు పూర్తై ఆర్నెళ్లు అవుతుండడం తో ఈ నెల చివర్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటన లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్..హైదరాబాద్ వచ్చాక అసెంబ్లీ సమావేశాలు తేదీని నిర్ణయించి ప్రకటించనున్నారు.

సెప్టెంబర్ 25లోపు ఉభయసభలు భేటీ కావాల్సి ఉండటం వల్ల.. గణేష్ ఉత్సవాలు పూర్తయ్యాక ఇవి సమావేశమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ సమావేశాల్లో ముఖ్యముగా దళితబంధుతో పాటు ఇతర అంశాలు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఉభయసభల ఆమోదం కోసం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మరోపక్క మొన్నటి వరకు హుజురాబాద్ ఉప ఎన్నికలపైనే అధిష్టానం దృష్టి పెడుతూ వచ్చింది. అధికార నేతలంతా హుజురాబాద్ నియోజవర్గం లోనే పర్యటిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు వాయిదా పడడం తో తర్వాత ఏంటి అనే దానిపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏదైనా సరే కేసీఆర్ వచ్చాకనే నేతలైన , అధికారులైనా ఏ నిర్ణయమైనా తీసుకుంటారు.