ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Indian Army
Indian Army

జమ్ముకశ్మీర్‌: ఈరోజు తెల్లవారుజామున జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర అనంతనాగ్‌ జిల్లా బిజ్‌బెహరాలోని సంగం వద్ద భద్రతా దళాల సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌, ఆర్మీ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/