నాలుగో రోజు ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

YouTube video
Live Streaming Of AP Legislative Council. Sessions Day 4 on 03.12.2020

అమరావతి: నాలుగో రోజు ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. అజెండాలో మొత్తం మూడు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, అరోగ్యశ్రీపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం, డీబీటీలపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. పలు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ బిల్లుతో పాటు దిశ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మునిసిపల్ చట్టం, ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/