రిలయన్స్‌ జియో నుంచి లాంగ్‌టెర్మ్ ప్రిపెయిడ్‌ ప్లాన్‌

reliance jio
reliance jio

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నుంచి మరో సరికొత్త దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ వచ్చేసింది. రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా, జియో నుంచి జియోకు అపరిమిత కాల్స్, ల్యాండ్ లైన్ వాయిస్ కాలింగ్, 12 వేల నాన్ జియో కాలింగ్ నిమిషాలు, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు వంటి ప్రయోజనాలు ఉన్న ఈ ప్లాన్‌ విలువ రూ.2121. కాలపరిమితి 336 రోజులు. గతేడాది డిసెంబరులో జియో ప్రకటించిన 2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లోని ప్రయోజనాలే ఇంచుమించు ఇందులోనూ ఉన్నాయి. కాకపోతే దానితో పోలిస్తే కాలపరిమితి తక్కువ. రూ. 2020 రీచార్జ్ ప్లాన్ కాలపరిమితి 365 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటా, జియో నుంచి జియోకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. పరిమిత కాలంపాటు తీసుకొచ్చిన ఈ ఆఫర్‌ను జియో తాజాగా ఉపసంహరించినట్టు తెలుస్తోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/