24న మహబూబ్‌నగర్‌కు రానున్న కెటిఆర్‌

Minister KTR
Minister KTR

మహబూబ్‌నగర్‌: పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈనెల 24న మహబూబ్‌నగర్‌కు ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్‌ రానున్న ట్టు ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టణాలను మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో 70 కొత్త మున్సిపాలిటీలు, 12కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దన ఘనత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కేటీఆర్‌ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/