హైదరాబాద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశృతి..

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ చుట్టూ భారీగా గణనాథుల విగ్రహాలు ఉన్నాయి. కాగా ఈ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. రెండు వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోయారు. సంజీవయ్య పార్క్ వద్ద కిషన్‌భాగ్ కు చెందిన ప్రణీత్ కుమార్ ప్రమాదవశాత్తు లారీ కింద పడి చనిపోయాడు.

మరో ఘటనలో నాలుగేళ్ళ బాలుడు చనిపోయాడు. బషీర్‌భాగ్ ఫ్లై ఓవర్ సమీపంలో గణేష్ ను నిమజ్జనం చేసేందుకు రాజశేఖర్ అనే వ్యక్తి ఫ్యామిలీ బైక్ ఫై వెళ్తుండగా.. బైక్ స్కిడ్ కావడంతో కిందపడిపోయారు. ఈ తరుణంలోనే…నాలుగేళ్ళ బాబు ఆయుష్ ఫై నుంచి టస్కర్ వాహనం వెళ్లింది. వెంటనే నీలోఫర్ హాస్పటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించినప్పటికీ..ఆ బాలుడి ప్రాణాలు కాపాడలేకపోయారు. బెల్లంపల్లి కి చెందిన బాధిత రాజశేఖర్ కుటుంబం, సంతోష్ నగర్ ప్రెస్ కాలనీలో నివాసం ఉంటుంది. ఈ రెండు ఘటనలు ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.

నగరంలో గురువారం ఉదయం ప్రారంభమైన లంబోదరుడి శోభాయాత్ర..రాత్రంతా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం తెల్లవారుజాము వరకు శోభాయాత్ర కొనసాగుతూనే ఉంది. ట్యాంక్ బండ్ పై కిలోమీటర్ల మేర గణనాథులు నిమజ్జనానికి వేయింటింగ్ లో ఉన్నాయి. రాత్రంతా భారీ వర్షం కురిసినా..వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులు నిమజ్జనంలో పాల్గొన్నారు. 11రోజుల పాటు ఎంతో వైభవంగా పూజలందుకున్న వినాయకుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్ తోపాటు వంద చోట్లు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిమజ్జనం చేస్తున్నారు.