రాజ్యసభలో 19 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ వేటు

న్యూఢిల్లీః రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకుంటున్న 19 మంది ఎంపీలపై వారం రోజుల పాటు సస్పెన్షన్ విధించారు. సభకు ఆటంకం కలిగిస్తున్న కారణంగా వారిపై వేటు వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ తెలిపారు. వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. జీఎస్టీ, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుపడుతున్న విషయం తెలిసిందే. సస్పెండైన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు లింగయ్య యాదవ్, రవీంద్ర వద్దిరాజు, దీవకొండ దామోదర్ రావు కూడా ఉన్నారు.
సస్పెండైన ఇతర ఎంపీలు వీరే…
సుస్మితా దేవ్- తృణమూల్
డాక్టర్ శంతను సేన్- తృణమూల్
మౌసమ్ నూర్- తృణమూల్
శాంతా చెత్రి- తృణమూల్
డోలా సేన్- తృణమూల్
అభిర్ రంజన్ దాస్- తృణమూల్
నదిముల్ హక్- తృణమూల్
కనిమొళి- డీఎంకే
హమీద్ అబ్దుల్లా- డీఎంకే
గిర్ రంజన్- డీఎంకే
ఎన్నార్ ఎలాంగో- డీఎంకే
ఎస్. కల్యాణసుందరమ్- డీఎంకే
ఎం.షణ్ముగం- డీఎంకే
ఏ.ఏ. రహీమ్- సీపీఎం
డాక్టర్ వి.శివదాసన్- సీపీఎం
పి.సంతోష్ కుమార్- సీపీఐ
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిఃhttps://www.vaartha.com/andhra-pradesh/