దావోస్ చేరుకున్న సీఎం జగన్

ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే ప్రధాన అజెండా

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో మే 22 నుంచి 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ తరలి వెళ్లడం తెలిసిందే. కాగా, సీఎం జగన్, ఏపీ అధికారులు గతరాత్రి దావోస్ చేరుకున్నారు. ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే ప్రధాన అజెండాగా దావోస్ లో సీఎం జగన్ టీమ్ సమావేశాలు నిర్వహించనుంది.

సీఎం జగన్ ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు గల అవకాశాలు, పారిశ్రామిక రాయితీలు, అనుకూలతలను వారికి వివరించనున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మితమయ్యే పోర్టులు, వాటి ద్వారా రవాణా, పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలను కూడా సీఎం ప్రస్తావించనున్నారు.

కాగా, సీఎం జగన్ దావోస్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 19 నుంచి 31 వరకు సీఎం జగన్ విదేశాల్లో పర్యటించేందుకు సమ్మతించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/