మోడీ రాక సందర్బంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Details of Prime Minister Modi’s visit to Telangana on the second day..

ప్రధాని మోడీ రెండు రోజుల నగర పర్యటన సందర్భాంగా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు వేధించారు నగర ట్రాఫిక్‌ విభాగం . శుక్రవారం సాయంత్రం 4.40 నుంచి 7 గంటల మధ్య బేగంపేట, పీఎన్‌టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ ఎక్స్‌రోడ్డు, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, రైల్వే హాస్పిటల్, మెట్టుగూడ రోటరీ, మీర్జాలగూడ టి-జంక్షన్, మల్కాజిగిరి ఆర్చి, లాలాపేట్, తార్నాక, గ్రీన్‌ల్యాండ్స్, మోనప్ప జంక్షన్, రాజ్‌భవన్, ఎంఎంటీఎస్‌ జంక్షన్, వీవీ విగ్రహం మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పేర్కొంది.

ఆయా మార్గాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించింది. అదేవిధంగా శనివారం ఉదయం 10.40 నుంచి 11.15 గంటల మధ్య మోడీ రాజ్‌భవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఆ సమయంలో వీవీ విగ్రహం, మెట్రో రెసిడెన్షీ లేన్, ఎంఎంటీఎస్‌ రాజ్‌భవన్, పంజగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, హెచ్‌పీఎస్‌ ఔట్‌ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పీఎన్‌టీ ఫ్లైఓవర్, ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని తెలిపింది.