పవన్ ను ఓడించేందుకు జగన్ వ్యూహాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడించి ఇక రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలనీ వైసీపీ అధినేత , సీఎం జగన్ చూస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారో ప్రకటన వచ్చిన తర్వాత అసలైన వ్యూహాలు మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యారు. అందుకే నిన్న పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే జగన్ అలర్ట్ అయ్యారు.

పవన్ పోటీ చేయబోతున్నారన్న సమాచారం మేరకు ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ద్వారా కొంతవరకు పవన్ కు చెక్ చెప్పాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే రీజనల్ ఇన్చార్జ్ మిధున్ రెడ్డి రంగంలోకి దిగారు. నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీపై నజర్ పెట్టి.. పోల్ మేనేజ్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. టిడిపి-జనసేనల నుంచి వచ్చే నాయకులను ఆకర్షించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. మరోపక్క తనకు టికెట్ రాలేదని చెప్పి టిడిపి అభ్యర్థి వర్మ..చంద్రబాబు ఫై ఆగ్రహంగా ఉన్నారు. నిన్న నియోజకవర్గంలో ఆగ్రహపు జ్వాలలు చెలరేగాయి. పవన్ కళ్యాణ్ ను ఖచ్చితంగా ఓడిస్తామంటూ టిడిపి శ్రేణులే చెప్పారు. ఇది కూడా జగన్ కు ప్లస్ కాబోతుంది. మరి జగన్ ఏంచేస్థాడో చూడాలి.