తెలంగాణలో రెండు రోజులు స్కూళ్లు బంద్‌..ఎందుకంటే

తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ కు రెండు రోజులు సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. ఈనెల 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్ష జరగనుంది. అయితే గ్రూప్‌-2 పరీక్షల కోసం కేటాయించిన పాఠశాలలకు 29, 30 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల‌కు 5,51,943 మంది ద‌ర‌ఖాస్తు చేస్తున్నారు. రెండు రోజుల్లో నాలుగు పేప‌ర్లకు ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. ప‌రీక్షకు వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచ‌నున్నారు.