నేడు సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష

నేడు సీఎం కేసీఆర్ నూతన సచివాయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్‌ కమిషనర్లు పాల్గొననున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో పాల్గొనాల్సిందిగా అన్ని శాఖల మంత్రులతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని ఆహ్వానించారు.

ఈ మేరకు సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్ కలెక్టర్లతో నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే. ముందుగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావించినా, ఆ తర్వాత నేరుగా సమావేశమై దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు.