మహేష్ బర్త్ డే స్పెషల్ : గుంటూరు కారం నుండి మాస్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా అభిమానులు సంబరాలు జరుపుతున్నారు. సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున సినీ , రాజకీయ ప్రముఖులంతా మహేష్ కు బెస్ట్ విషెష్ అందజేస్తున్నారు. బర్త్ డే సందర్బంగా ఆయన నటిస్తున్న గుంటూరు కారం నుండి మాస్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తుండగా..హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకం పై నాగవంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్ వచ్చి ఆడియన్స్ లో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసింది. నేడు ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా లుంగీ కట్టుకొని సిగిరెట్ అంటిస్తున్న మహేష్ తాలూకా పోస్టర్ ను రిలీజ్ అభిమానుల్లో ఆనందం నింపారు. ఈ లుక్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు, రేఖ, రమ్యకృష్ణ, జైరాం, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని శరేవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి కచ్చితంగా రిలీజ్ చేసేందుకు మూవీ టీం గట్టిగా ప్రయత్నిస్తుంది.