ఏపిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు
తాజాగా ప్రకాశం జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ అధికారుల ప్రకటన

అమరావతి: దేశలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈక్రమంలో ఏపిలో కూడా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా సోకగా, తాజాగా ప్రకాశం జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించింది. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 190 మంది రక్త నమూనాలు సేకరించగా, వారిలో 94 మందికి నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో 13 మంది నమూనాల ఫలితాలు రావల్సి ఉన్నాయిని అధికారులు బులెటిన్లో తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/