అత్యంత విలువైన భారత ఆటగాడు ధోని

ట్విటర్‌ వేదికగా జాఫర్‌ వెల్లడి

dhoni
dhoni

ముంబయి: భారత మాజీ సారది, వికెట్‌ కీపర్‌ అయినటువంటి మహేంద్రసింగ్‌ ధోని టీమ్‌ ఇండియాకు వెలకట్టలేని ఆస్తి అని మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ధోని ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌లో ఉంటే అతడిని మించి మరే ఆటగాడిని చూడాల్సిన పని లేదని, లోయర్‌ ఆర్డర్‌తో పాటు వికెట్లవెనక అతను విలువైన ఆటగాడని ట్వీట్‌ చేశారు. కాగా జాఫర్‌ ఇటీవలే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పాడు. ధోని ప్రస్తుతం రాంచిలో తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నాడు. చివరిసారిగగా వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని ఆడాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/