ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీకి చేరిన సీ-17 విమనాలు

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశం నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్‌ గంగలో భాగంగా మరో రెండు విమానాలు న్యూఢిల్లీ చేరుకున్నాయి. 420 మందితో హంగరీలోని బుడాపెస్ట్‌, రొమేనియాలోని బుకారెస్ట్‌ నుంచి
వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 విమానాలు ఢిల్లీ సమీపంలోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో దిగాయి. స్వదేశానికి తిరిగివచ్చిన విద్యార్థులకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ స్వాగతం పలికారు.

కాగా, ఆపరేషన్‌ గంగలో భాగంగా ఇప్పటివరకు 6400 మంది భారతీయులు ఉక్రెయిన్‌ నుంచి తిరిగివచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో రెండు మూడు రోజుల్లో 7400 మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటారని తెలిపింది. ఇప్పటివరకు 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ను వీడారని అధికారులు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/