వివేకా కేసు.. సీబీఐ నోటీసులు తీసుకునేందుకు అవినాశ్ రెడ్డి నిరాకరణ

వివేకా హత్య కేసులో అవినాశ్, ఆయన తండ్రికి సీబీఐ నోటీసులు
కడప జిల్లా కోర్టును ఆశ్రయించిన సీబీఐ


అమరావతి: మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 207 మందిని విచారించిన సీబీఐ అధికారులు… 146 మంది వాంగ్మూలాలు తీసుకున్నారు. మరోవైపు పలువురు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో, వారిని విచారించేందుకు సీబీఐ సిద్ధమైంది.

ఈ క్రమంలో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం పరిధిలోని స్పెషల్ క్రైమ్స్ మూడో విభాగం అధికారులతో పాటు మరికొందరు ముఖ్య అధికారులు నిన్న పులివెందులకు చేరుకున్నారు. సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా వాటిని తీసుకునేందుకు వారు నిరాకరించినట్టు సమాచారం. దీంతో, కడప జిల్లా కోర్టును వారు ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కోర్టు అనుమతితో ఈరోజు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/