బాబీకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన వీరయ్య..

బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న చిరంజీవి అండ్ మెగా అభిమానులు వాల్తేర్ వీరయ్య తో అసలు సిసలైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. బాబీ డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. చిరంజీవి గత చిత్రాలు ఆచార్య , గాడ్ ఫాదర్ ప్లాప్స్ కావడం తో అంత వాల్తేర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను డైరెక్టర్ బాబీ సజీవం చేసారు. దీంతో బాబీ కి చిరంజీవి ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారని ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి కి బాబీ సుదీర్ఘ కాలంగా మెగా ఫ్యాన్. ఒక అభిమానిగా చిరంజీవిని వాల్తేరు వీరయ్య సినిమాలో దర్శకుడు బాబీ చూపించాడు. అందుకే ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. బాబీ తనపై చూపించిన అభిమానానికి చిరంజీవి ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు. అందుకే ఆ ఖరీదైన బహుమానం ను ఇచ్చాడని మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది.

ఇక సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే..సినిమాకు మొదటి రోజు మొదటి ఆట తోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడం తో ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా బాక్సాఫీసును కొల్లగొడ్తోంది. తాజాగా 2 మిలియన్ డాలర్ ప్లస్ క్లబ్ లోకి చేరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వారంలో 3 మిలియన్ డాలర్ల ప్లస్ లోకి చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వస్తున్నారు. ఈ సినిమా ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లను కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 83.53 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ భారత్ రూ.5.65 కోట్లు ఓవర్సీస్ లో రూ.10.20 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా రూ.53.53 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సక్సెస్ ను మెగాస్టార్ తో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.