కాబూల్‌లోని పాఠశాల వద్ద బాంబు పేలుళ్లు : 30 మంది మృతి

మరో 50 మందికి తీవ్ర గాయాలు

A bomb blast near a school in Kabul has killed at least 30 people
A bomb blast near a school in Kabul has killed at least 30 people
  • కాబూల్‌లోని దష్ట్-ఎ-బార్చి జిల్లాలో దుర్ఘటన
  • మృతుల్లో 11-15 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులే
  • ఈ ఘటన ను ఖండించిన తాలిబన్లు
  • తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి

Kabul‌: ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని ఓ పాఠశాల వద్ద బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు పాల్పడ్డారు . అత్యంత శక్తిమంతమైన ఈ పేలుడులో 30 మందిమృతి చెందారు. వీరిలో 11-15 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. పశ్చిమ కాబూల్‌లోని దష్ట్-ఎ-బార్చి జిల్లాలోని సయ్యద్ అల్ షాదా పాఠశాల వద్ద జరిగిన ఈ ఘటనపై తాలిబన్లు స్పందిస్తూ , దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెబుతూ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/