తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్‌ డ్రై రన్ పై గవర్నర్ ఆరా

నాలుగు దశలుగా 80 లక్షల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ

Telangana GovernorTamilisai
Telangana GovernorTamilisai

Hyderabad: కొత్త ఏడాదిలో కరోనా మహమ్మరిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ రావడం సంతోషదాయకమని తెలంగాణ గవర్నర్ తమిళసై అన్నారు. 

రాష్ట్రంలో నాలుగు దశలుగా 80 లక్షల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. మొదటి దశలో ఐదు లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇస్తామని చెప్పారు.

ఇది అత్యంత సురక్షితమైన వ్యాక్సిన్‌ అని, అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత వ్యాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

యూపీహెచ్‌సీలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్‌ డైరన్‌ను గవర్నర్‌ పరిశీలించారు. డైరన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/