మంత్రి తలసానిని కలిసిన బుల్లితెర నిర్మాతల కమిటీ

ఇటీవల 2వేల మంది టీవీ కళాకారులకు తలసాని సాయం

talasani srinivasa yadav
talasani srinivasa yadav

హైదరాబాద్‌: తెలుగు బుల్లితెర నిర్మాతల కమిటీ సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఇటీవల లాక్ డౌన్ సందర్భంగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న 2 వేల మంది టీవీ కళాకారులు, కార్మికులకు తలసాని నిత్యావసరాలు పంపిణీ చేసి ఆదుకున్నారు. ఈ నేపథ్యంలో, టీవీ ప్రొడ్యూసర్స్ కమిటీ అధ్యక్షుడు ప్రసాద్, సభ్యులు ప్రభాకర్, వినోద్ బాల, కిరణ్, అశోక్, డీవై చౌదరి, వెంకటేశ్వరరావు తదితరులు సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి తలసాని నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తలసాని టీవీ రంగ ప్రముఖులతో తాజా పరిస్థితులపై చర్చించారు. కరోనా గురించి మాట్లాడుతూ, అన్ని రంగాలకు ఇదొక సవాల్ గా మారిందని, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నివారణ సాధ్యమేనని తెలిపారు. షూటింగుల నేపథ్యంలో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచన చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/