ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా ప్రారంభం

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని, ధాన్యం సేకరణపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తూ, టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఇందిరాపార్క్ వద్దకు భారీగా తరలి వ‌చ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి బాధ్యులు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మాత్రమే ఈ మహా ధర్నా రావాలని నిర్ణయించినప్పటికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా ధర్నాచౌక్‌కు తరలివస్తున్నారు.

మహాధర్నా ఏర్పాట్లు అసాధారణ రీతిలో చేశారు. వేదిక మీద సీఎం కేసీఆర్, మంత్రులు, వేదిక ముందు ఒక కంపార్ట్‌మెంట్ల‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల బాధ్యులు, మరో కంపార్ట్‌మెంట్ల‌లో కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి నేతలకు మరో కంపార్ట్‌మెంట్‌.. ఆ తర్వాత ఇతరులు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉరకలెత్తే ఉత్సహంతో ప్లకార్డులతో తరలివస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/