సంక్రాంతికి ఫ్రీ బస్సు లేదనే వార్తలపై సజ్జనార్ క్లారిటీ

Free Bus Service For Women In Telangana

తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన కాంగ్రెస్..అధికారం చేపట్టిన రెండురోజుల్లోనే మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కలిపించి ఆనందం నింపింది. ఫ్రీ పథకం పెట్టిన దగ్గరి నుండి మహిళలు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. కాగా సంక్రాంతి పండగకు ఫ్రీ బస్సు సౌకర్యం లేదనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారిన క్రమంలో TSRTC ఎండీ సజ్జనార్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

సంక్రాంతికి పండుగకు పుట్టింటికి వెళ్లే మహిళలకు ఉచిత బసు ప్రయాణం పథకం అందుబాటులో ఉంటుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. అయితే అది కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు.

అలాగే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ తెలిపారు. స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ బస్సులను రాష్ట్రంలో జనవరి 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి శబరిమలకు వెళ్లే ప్రతి ప్రయాణికుడి వద్ద నుంచి రూ.13,600 చొప్పున వసూలు చేయనున్నారు. ఇందులో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా అందించనున్నట్లు తెలిపారు.