కిన్నెర మొగిలయ్యను సన్మానించడమే కాదు గొప్ప ఛాన్స్ ఇచ్చిన సజ్జనార్

ఆర్టీసీ బస్సుపై పాట పాడి వార్తల్లో నిలిచిన కిన్నెర మొగిలయ్యను ఆర్టీసీ అధికారులు సన్మానించారు. మొగిలయ్య టీఎస్ఆర్టీసీ ప్రయాణంపై పాడిన పాట వైరల్ కావడంతో బస్ భవన్ పిలిపించుకొని సన్మానించారు. ఇకపై మొగిలయ్య రాష్ట్రంలో ఏ ఆర్టీసీ బస్సులోనైనా ప్రీగా ప్రయాణం చేసే అవకాశం ఇచ్చారు. ఆర్టీసీ అధికారుల నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు మొగిలయ్య.

కిన్నెర పాడిన పాట రెండు రోజుల పాటు సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అయింది. కిన్నెర మొగులయ్య పాడిన ఆర్టీసీ పాట వీడియో కు సోష‌ల్ మీడియా లో లక్షలలో వ్యూస్, లైక్ లు వ‌చ్చాయి. దీంతో ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ కిన్నెర‌ మొగులయ్యని ఘనంగా సన్మానించారు. అలాగే కిన్నెర మొగుల‌య్య పాట ప‌ట్ల ధ‌న్య‌వాద‌లు తెలిపారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ తాలూకా టైటిల్ సాంగ్ ను థమన్ మొగులయ్య తో పాడించారు. ఈ పాటలో ఏడు మెట్ల కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ మొగులయ్య ప్రోమో లో కనిపించాడు.