డ్రైవర్స్, కండక్టర్లకు TSRTC తీపి కబురు

తెలంగాణ డ్రైవర్స్, కండక్టర్లకు TSRTC గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ లో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పధకం ప్రారంభమైన దగ్గరి నుండి ఆర్టీసీ లాభాల్లో నడుస్తుంది. ప్రతి రోజు లక్షల మంది బస్సు లో ప్రయాణం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆర్టీసీ డ్రైవర్స్ , కండక్టర్లు సెలవు తీసుకోకుండా డ్యూటీ చేస్తున్నారు. ఈ తరుణంలో వారికీ తీపి కబురు అందించింది TSRTC .

గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో, అలాగే ఇతర జోన్‌లో ఆర్టీసీ బస్సులను నడిపే డ్రైవర్లకు, కండక్టర్లకు డబుల్ డ్యూటీ చేసే వారికీ పెరిగిన వేతనం ఇవ్వనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో రెగ్యులర్ డ్రైవర్లకు ఇదివరకు రోజుకు 740 రూపాయలు ఇస్తుండగా డబుల్ డ్యూటీకి ఇప్పుడు రూ.900 ఇవ్వనున్నారు.

కండక్టర్లకు రూ.700 ఉండగా రూ 850 రూపాయలు, అలాగే కాంట్రాక్టు డ్రైవర్లకు రూ.590 నుండి రూ.720 ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇక కాంట్రాక్ట్ కండక్టర్స్‌కు రూ. 510నుంచి రూ.620 రూపాయలు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఇతర జోన్‌లలో రెగ్యులర్ డ్రైవర్లకు ఇది వరకు రూ.600 రూపాయలు ఇచ్చేవారు ఇక నుండి రూ.730, కండక్టర్లకు రూ.530 నుండి రూ.650 కాంట్రాక్టు డ్రైవర్లకు రూ.480 నుండి రూ.590 కాంట్రాక్టు కండక్టర్స్ రూ.420నుంచి రూ.510 ఇవ్వనున్నారు. పెంచిన వేతనం ప్రకారం డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం ప్రకారం సిబ్బందికి చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ, రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలోని డిపోలకు చెందిన అధికారులను ఆదేశించారు.