గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

TSPSC Announced Group 1, Group 2, Group 3 Exam Dates

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. వారు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న షెడ్యూల్ వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహిస్తారు. గ్రూప్ 1 ద్వారా 563 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రూప్ 2లో 783 ఉద్యోగాలు ఉండగా ఆగస్ట్ 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 2022లో విడుదల చేసిన గ్రూప్ 3లో 1388 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు.