రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై సామూహిక అత్యాచారం

నిందితుల కోసం పోలీసులు గాలింపు

Mass rape of a woman at a railway station
Mass rape of a woman at a railway station

Repelle : నూతనంగా ఏర్పాటైన బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్ లో మహిళపై సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి పనుల కోసం ఆ మహిళ రేపల్లెకు వచ్చినట్టుగా తెలుస్తోంది. రేపల్లె నుంచి కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చిన ఈ మహిళపై నిందితులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. భర్తను బెదిరించి భార్యపై ముగ్గురు అత్యాచారం చేసినట్టు తెలిసింది.. పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.
బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా బాధితురాలి భర్త రైల్వే పోయీసు స్టేషన్ కు వెళ్లి తలుపుకొట్టినా వారు స్పందించలేదని తెలిసింది.. ఆతర్వాత సమీప పొలిసు స్టేషన్ కు వెళ్లి భర్త వారికి ఫిర్యాదు చేశారు..
ఇదిలా వుండగా.. రేపల్లె రైల్వేస్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో ఫోన్లో మాట్లాడారు.

రేపల్లె ప్రభుత్వాసుపత్రి వద్ద టీడీపీ ఆందోళన

ఈ సంఘటనపై రేపల్లె ప్రభుత్వాసుపత్రి వద్ద టీడీపీ ఆందోళనకు దిగింది. ప్రభుత్వ అసమర్థత వల్లే మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/