బెంగళూరు అల్లర్లపై స్పందించిన కేటీఆర్

రెచ్చగొట్టే చర్యలకు సామాజిక మాధ్యమాలను వాడొద్దు

హైదరాబాద్‌ : కర్ణాటకలోని  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద నెలకొన్న హింసపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ఎంత ప్రమాదకరమో.. ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఇటువంటి న్యూస్ ప్రచారం చేయొద్దని సూచించారు. ‘సామాజిక మాధ్యమాల్లో చేసే నకిలీ ప్రచారం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలుపుతోంది. బాధ్యతగా ఉండాలని సామాజిక మాధ్యమాలను వాడే అందరినీ నేను కోరుతున్నాను. ఇటువంటి ప్రచారాలు చేయొద్దు, నకిలీ వార్తలను ప్రచారం చేయడం ఆపండి. అసాంఘిక చర్యలను రెచ్చగొట్టే సాధనంగా సామాజిక మాధ్యమాలను వాడొద్దు’ అని కేటీఆర్ సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/