నేడు ఢిల్లీకి బాబు , పవన్ , రేవంత్

నేడు హస్తినకు టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ తొలి సమావేశం నేపథ్యంలో రాష్ట్ర PCC చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కి వెళ్తుండగా…ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి పొత్తు గురించి మాట్లాడేందుకు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు వెళ్ళబోతున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పవన్ , బాబు భేటీ కానుండగా.. రాష్ట్రంలో BJPతో పొత్తుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం కూడా షాతో బాబు భేటీ కాగా.. పొత్తులపై స్పష్టత రాలేదు. నేటి సమావేశంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ-జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

ఇటు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పోటీ చేసే నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం తో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం తొలి జాబితా కింద రాష్ట్రం నుంచి 8-10 పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.