వైసీపీ ఓటమికి ఐప్యాక్ సలహాలే కారణం – పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. వై నాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్ పార్టీ..కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇంత ఘోర ఓటమి ని ఆ పార్టీ నేతలు తట్టుకోలేపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ స్పందనను తెలియజేస్తూ వస్తుండగా..తాజాగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్, అధికారులు తమ మాట విని ఉంటే గెలిచేవాళ్లమని కాటసాని వ్యాఖ్యానించారు. వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ కారణమని చెప్పారు. పది రోజుల్లోనే సీన్ మొత్తం మారిపోయిందని కాటసాని వ్యాఖ్యానించారు. రైతుల భూములు లాక్కుంటామని టీడీపీ ప్రచారం చేసిందని తెలిపారు. ఇసుక పాలసీ కూటమి కూడా వైసీపీకి నష్టం చేసిందని ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి పేర్కొన్నారు.