కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ‌

శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదని వెల్లడి

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ కు మరోసారి లేఖ రాసింది. తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఈ లేఖ రాశారు. శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదని తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో గరిష్ట విద్యుదుత్పత్తికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎత్తిపోతల పథకాలు, బోర్లకు విద్యుచ్ఛక్తి అవసరమని స్పష్టం చేశారు.

అయితే, పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయకుండా ఆపాలని కోరారు. త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండా నీటి విడుదల చేయరాదని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్ అవసరాలకే జలాలను వినియోగించాలని లేఖలో పేర్కొన్నారు. పరీవాహక ప్రాంతం వెలుపలకు నీటిని తరలించుకుండా ఏపీని నిలువరించాలని విజ్ఞప్తి చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/