నోరు పెద్దదైతే… గిన్నిస్ రికార్డు!
అతి పెద్ద నోరుతో సమంత రామ్స్డెల్ వరల్డ్ నెంబర్ 1

అమెరికాకు చెందిన సమంత రామ్స్డెల్ తన నోరుతోనే ఫన్నీ వీడియోలు చేసి టిక్‌టాక్ ద్వారా అందరికీ సుపరిచితం అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా , ఆమె ఫాలోవర్లు గిన్నిస్ రికార్డుకు ప్రయత్నించమని సలహా ఇచ్చారట. ఇంకేముంది వెంటనే సమంత డెంటిస్ట్ తో తన నోటిని కోలత చేయించింది. డిజిటల్ కాలిపర్ల సాయంతో నోటి పొడవు , వెడల్పు 6.52 సెం.మీ ఉందని తేలింది. వెంటనే ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. చివరకు ప్రపంచంలోనే అతిపెద్ద నోరు కలిగిన మహిళగా గిన్నిస్ నిర్వాహకులు సర్టిఫికెట్ అందజేశారు. కాగా చిన్నతనం నుంచి పెద్ద నోరు ఉండటంతో చాలామంది అపహాస్యం చేసినా నవ్వులు పంచుతూ టిక్ టాక్ వీడియోలు చేసిన సమంత ఇపుడు అదే నోరు ఆమెకు గిన్నిస్ వరల్డ్ రికార్డు తెచ్చిపెట్టింది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/