బాలయ్య చిత్ర మేకర్స్ కు షాక్ ఇచ్చిన తమన్నా..?

Tamannaah’s Big Surprise And Turning Point In 'F3'

ఒకప్పుడు అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉండే..తమన్నా ప్రస్తుతం ఐటెం సాంగ్స్ కు పరిమితమైంది. కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. కానీ అప్పుడప్పుడు ఐటెం సాంగ్ ఛాన్సులు తలుపుతడుతున్నాయి. తాజాగా అనిల్ రావిపూడి – బాలకృష్ణ కలయికలో తెరకెక్కుతున్న మూవీ లో ఐటెం సాంగ్ ఛాన్స్ వచ్చినప్పటికీ..అమ్మడు తన రెమ్యూనరేషన్ ను భారీగా అడిగినట్లు ప్రచారం నడుస్తుంది.

గతంలో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఎఫ్ 2 , ఎఫ్ 3 చిత్రాల్లో హీరోయిన్ గా తమన్నా నటించగా , సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో ప్రత్యేక సాంగ్ లో తమన్నా చిందులేసింది. ఇదే తరుణంలో ఇప్పుడు మరో ఛాన్స్ తమన్నా కు అనిల్ ఇవ్వగా..అమ్మడు మాత్రం ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసినట్లు ప్రచారం నడుస్తుంది.

ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ స్టార్​ హీరోలతో స్పెషల్​ సాంగ్స్​ కి తమన్నా బెస్ట్​ చాయిస్​గా మారింది. ఇప్పటికే జూనియర్​ ఎన్టీఆర్​, మహేశ్​ బాబు, యష్​ వంటి హీరోలతో స్టెప్పులేసి అదరగొట్టింది. ఇప్పుడు బాలయ్యతో తమన్నా కాంబో అంటే ఫ్యాన్స్​ ను ఏ రేంజ్​లో ఊపేస్తుందో వేచి చూడాలి. ఇక ఈ మూవీ లో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా , శ్రీ లీల బాలయ్య కు కూతురి పాత్రలో కనిపించబోతుంది.