ఈరోజు కామారెడ్డి, మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

Election campaign of Revanth Reddy in Kamareddy and Malkajgiri today

హైదరాబాద్‌ః నేడు కామారెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కామారెడ్డి పట్టణం, దోమకొండ, బీబీపేట్ లో రోడ్ షో లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి…ఉదయం 10 గంటలకు కామారెడ్డి పట్టణంలో రోడ్ షోలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు దోమకొండలో రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు బీబీపేట్ రోడ్ షోలో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మల్కాజ్ గిరిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రోడ్ షో లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. ఇక అటు హైదరాబాద్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ ఉన్నాయి. 10 గంటలకు జూబ్లీహిల్స్, 12 గంటలకు నాంపల్లి, 2 గంటలకు మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్ చౌరస్తాలో రాహుల్ గాంధీ రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ ఉన్నాయి.