తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల

తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధువారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 86.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత పొందారు. ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ప్ర‌యివేటు విద్యార్థులు 44.51 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు చేయ‌గా, బాలురు 43.06 శాతం, బాలిక‌లు 47.73 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

ప‌ది ఫ‌లితాల్లో నిర్మ‌ల్ జిల్లా మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, 99 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. వికారాబాద్ జిల్లా చివ‌రి స్థానంలో నిలిచింది. కాగా ఈ జిల్లాల్లో 59.46 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2,793 పాఠ‌శాల‌ల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. 25 పాఠ‌శాల‌ల్లో జీరో శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.