బాలయ్య 108 మూవీ నుండి అర్జున్ రాంపాల్ ఫస్ట్ లుక్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలకృష్ణ 108 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా, బాలయ్య కు కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈయన తాలూకా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే అది విలన్ పాత్రేనా .. లేదా అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మింస్తున్నారు.