పోలింగ్ జరుగుతుండగా..కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ కర్ణాటక వ్యాప్తంగా 20.94 శాతం పోలింగ్ నమోదయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ తరుణంలో కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తన ఓటు హక్కుని వినియోగించుకొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ఎన్నికల తర్వాత కూడా జేడీఎస్‌తో పొత్తు ఉండబోదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితికి వచ్చే అవకాశం ఉండదని, కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. మరోవైపు హెచ్‌డీ కుమారస్వామి కూడా ఇదే దీమాతో ఉన్నారు. జేడీఎస్ కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవుతుందని వ్యాఖ్యానించారు.

మరోపక్క బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్‌లో గ్యాస్ సిలిండర్లకు కాంగ్రెస్ కార్యకర్తలు పూజలు నిర్వహించారు. దండలు వేసి, అగరువత్తులు వెలిగించడం గమనార్హం. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫేస్టోలో గృహ జ్యోతి పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చింది.