వలసల నిషేధం 60 రోజులే..ట్రంప్‌ ప్రకటన

donald trump
donald trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ దేశంలోని వలసల్ని తాత్కాలికంగా నిషేదిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అది ఎంత కాలం వరకు అమలు చేయనున్నారో కూడా ట్రంప్‌ స్పష్టతనిచ్చారు. 60 రోజుల పాటు ఈనిషేధం అమల్లో ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా అమెరికాలో ప్రస్తుతం కరోనా వైరస్ ఉంది కాబట్టి ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు ఊడిపోవడంతో… ఉన్న ఉద్యోగాల్ని విదేశీ వలసదారులు లాగేసుకోకుండా స్థానికులకే దక్కేందుకు ఈ 60 రోజుల వసల వాదుల నిషేధాన్ని ట్రంప్‌ తాజాగా ప్రకటించారు. ట్రంప్ ప్రకటన వల్ల అమెరికాలో శాశ్వతంగా ఉండాలనుకునే వారు (గ్రీన్ కార్డు దారులు) ఇబ్బందుల్లో పడినట్లే ట్రంప్ రూల్ అమల్లోకి రాగానే వారు 60 రోజులపాటూ శాశ్వతంగా ఉండేందుకు అప్లై చేసుకోవడానికి వీలవ్వదు. 60 రోజుల తర్వాత ట్రంప్ ఆ నిషేధం కొనసాగిస్తారో లేక ఎత్తేస్తారో తెలియదు. అసలే అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న టైం. ఈ సమయంలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి కొత్త రూల్ తేబోతున్నట్లు తెలిసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/