63 పాయింట్లతో మోడి అగ్రస్థానం

కరోనా నియంత్రణలో ర్యాంకింగ్స్ ప్రకటించిన ‘మార్నింగ్ కన్సల్ట్’

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలను చేపట్టడంలో ప్రధాని నరేంద్రమోడి, ప్రపంచ దేశాల అధినేతలకంటే ముందు వరులలో నిలిచారు. ఈవిషయాన్ని వీడీపీ అసోసియేట్స్‌ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పోలింగ్ సేవలను అందిస్తున్న ‘మార్నింగ్ కన్సల్ట్’ తాజాగా నిర్వహించిన సర్వే తరువాత, ప్రపంచ ప్రధానులు, అధ్యక్షుల ర్యాంకింగ్స్ ప్రకటించిందని పేర్కొంది. ఈ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 68 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఒబ్రాడర్ అధ్యక్షుడు లోపేజ్ కు 36, యూకే ప్రధాని జాన్సన్ కు 35, ఆస్ట్రేలియా ప్రధాని మోరిస్ కు 26 పాయింట్లు దక్కాయి. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మైనస్ 3 పాయింట్లు లభించాయి. ఈ జాబితాలో ట్రుడావ్ కు 21, మెర్కెల్ 16, బోల్సోనారా 8 పాయింట్లతో ఉండగా, మార్కాన్ మైనస్ 21, షింజో అబే మైనస్ 33 పాయింట్లతో ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/