తెలంగాణ చేరుకున్న బీహార్‌ వలస కార్మికులు

migrant-workers

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సొంత రాష్ట్రాలకు వెళ్లిన వలస కార్మికులు తిరిగి వస్తున్నారు. తొలి విడతగా బీహార్ నుండి 225 మంది వలస కూలీలు హైదరాబాద్‌కు వచ్చారు. బీహార్ రాష్ట్రంలోని ఖగారియా నుంచి కూలీలు ప్రత్యేక శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైలులో లింగంపల్లి స్టేషన్‌కు చేరుకున్నారు. బీహార్ నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. రైతు బందు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పుష్పాలతో స్వాగతం పలికారు. ప్రదానంగా రైస్ మిల్లులలో పనిచేయడానికి వీరంతా వచ్చారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు తరలి వెళ్తున్న తరుణంలో తెలంగాణాలో మాత్రం రివర్స్ జరుగుతోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/