ప్రతి ఒక్కరికి ధన్యవాదలు

ఎమ్మెల్సీ ఎన్నికలో కవిత ఘన విజయం

ప్రతి ఒక్కరికి ధన్యవాదలు
i-am-thankful-to-everyone-says -kavitha

హైదరాబాద్‌: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నకల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తన గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు.

మరోవైపు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, అబద్దపు మాటలు చెప్పి బిజెపి నేతలు మోసం చేశారని… అయినా ప్రజలు వారిని నమ్మలేదని అన్నారు. విపక్షాల అబద్దాలకు బదులుగా కవితకు విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. మరోసారి న్యాయం గెలిచిందని అన్నారు. కాంగ్రెస్, బిజెపి లకు డిపాజిట్లు కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలో కవితకు 728 ఓట్లు పడ్డాయి. ఈ నెల 14న కవిత ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. మరోవైపు కవిత గెలుపుతో టిఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/