పండగ వేళ కేంద్రం ప్యాకేజీలు

YouTube video
Press Conference by Union Finance Minister Nirmala Sitharaman on Economic issues

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైన వేళ వినిమయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ వీటికి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేశారు. మ‌హమ్మారి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని, పేద‌బ‌ల‌హీన వ‌ర్గాల కోసం ప్ర‌భుత్వం ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించింద‌ని, కొంత వ‌ర‌కు అవరోధాలు తీరినా.. కానీ వినియోగ‌దారుడికి మ‌రింత బూస్ట్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి చెప్పారు. క‌స్ట‌మ‌ర్లు త‌మ ఖ‌ర్చును పెంచే విధంగా కొన్ని ప్ర‌తిపాద‌న‌ల‌ను డిజైన్ చేసిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

చి ఎల్‌టీసీ క్యాష్ వోచ‌ర్‌, స్పెష‌ల్ ఫెస్టివ‌ల్ అడ్వాన్స్ స్కీమ్ ప‌థ‌కాల‌ను మంత్రి ప్ర‌క‌టించారు. ట్రావెల్ క్యాష్ వోచ‌ర్ల‌తో ఉద్యోగులు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చేసుకోవ‌చ్చు అని, మూడింత‌లు టికెట్ ధ‌ర‌ను కూడా తీసుకోవ‌చ్చు అని తెలిపారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌తో 12 శాతం జీఎస్టీ ఉండే వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు అన్నారు. కేవ‌లం డిజిట‌ల్ లావాదేవీల‌ను మాత్ర‌మే ప్రోత్స‌హించ‌నున్నారు. ఒక‌వేళ కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఈ ఆప్ష‌న్ వాడుకుంటే, అప్పుడు ప్ర‌భుత్వానికి 5675 కోట్లు ఖ‌ర్చు కానున్న‌ది. పీఎస్‌బీ, పీఎస్‌యూల‌కు 1900 కోట్లు ఖ‌ర్చు కానున్న‌ది.

నాన్ గెజిటెడ్ ఉద్యోగుల‌కు స్పెష‌ల్ ఫెస్టివ‌ల్ అడ్వాన్స్ స్కీమ్‌ను అమ‌లు చేయ‌నున్నారు. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌డ్డీ లేని ప‌ది వేల రుణం ఇవ్వ‌నున్నారు. ప్రీపెయిడ్ రూపేకార్డు రూపంలో ఆ అమౌంట్ ఇస్తారు. వ‌చ్చే ఏడాది 31వ తేదీలోగా ఆ మొత్తాన్ని ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ వ‌ల్ల ప్ర‌భుత్వంపై సుమారు 4000 కోట్లు భారం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే స్కీమ్‌ను అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తే అద‌నంగా మ‌రో 8000 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. పండుగ వేళ ఉద్యోగులు ఈ మొత్తాన్ని ఖ‌ర్చు చేసుకోవ‌చ్చు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/