‘మహా సముద్రం’లో …
అదితి రావు హైదరి నటించబోతోందని మేకర్స్ ప్రకటన

టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ అనే సినిమా చేస్తోనట్లు రీసెంట్ గా అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
కాగా తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా అదితి రావు హైదరి నటించబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అజయ్ ఇప్పటికే అదితి రావు హైదరికి కథ కూడా వివరించారు. అదితి రావు హైదరి కూడా ఈ సినిమా చేయడానికి బాగా ఆసక్తిగా ఉందట.
కాగా సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట.
ఇక త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలకు వస్తే..
సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి తదితరులు నటిస్తున్నారు.
వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/