ఈరోజు సాయంత్రం గన్ పార్క్ వద్ద కేసీఆర్ నివాళులు…

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ వేడుకల సందర్భాంగా బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్..ఈరోజు సాయంత్రం 6 గంటలకు గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం గన్ పార్క్ నుండి అమరజ్యోతి వరకు 10 వేల మందితో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ర్యాలీలో కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారని సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. అధికారంలోకి రాగానే కంచెలు తొలగిస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ చుట్టూ కంచెలు బిగిస్తోందంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9. గంటల నుంచి 10 గంటల వరకు.. అలాగే పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్సలు విధించారు. కాబట్టి ఈ ప్రాంతాలకు వెళ్లాలనుకునే కాస్త అప్రమత్తంగా ఉండాలి.