తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం

sonia-gandhi-message-to-people-of-telangana

హైదరాబాద్‌ః తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది నిమిషాల్లోనే తెరపడనుంది. గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. బహిరంగ సభలు రోడ్డు షోలు కార్నర్ మీటింగ్లు ఇలా వచ్చిన ప్రతి మార్గం గుండా ప్రజలకు చేరువయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈతరణంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కీలక సందేశం ఇచ్చారు. ఆరోగ్య కారణాల రీత్యా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయిన సోనియా గాంధీ ఎన్నికలకు రెండు రోజుల ముందు వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రియమైన సోదర సోదరీమణులారా నేను మీ దగ్గరికి రాలేకపోతున్నాను. కానీ మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తవ్వడం చూడాలనుకుంటున్నా. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజల తెలంగాణ మనందరం కలిసి మార్చాలి మీ కలలు సహకారం అవ్వాలి మీకు మంచి ప్రభుత్వము లభించాలని పిలిచి నాకు చాలా గౌరవించాలి ఈ ప్రేమ అభిమానాలు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను తెలంగాణ సోదరులు అమ్మలు బిడ్డలకు నా విన్నపం మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటేయండి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అని వీడియో ద్వారా సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు.