యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో ట్రయల్ రన్ సక్సెస్

యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో అధికారులు రెండు యూనిట్లకు సక్సెస్ ఫుల్ గా ట్రయల్ రన్ నిర్వహించారు. దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉన్న రెండు యూనిట్లకు సంబంధించిన యాక్సిలరీ బాయిలర్లను లైట్ అప్ చేశారు. దీంతో యాదాద్రి ప్లాంట్ పవర్ జనరేషన్​లో చారిత్రక ఘట్టం ప్రారంభమైంది. దశల వారీగా పవర్ జనరేషన్ చేపట్టి త్వరలో గ్రిడ్​కు అనుసంధానం చేయనున్నారు.

ఇటీవలే యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో జెన్ కో విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేసింది. దీనిలో భాగంగా మొదటి విడతగా 800 మెగావాట్లను ఉత్పత్తి చేసే రెండు యూనిట్లతో 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ రెండు యూనిట్లకు సంబంధించిన యాక్సిలరీ బాయిలర్లను లైట్ అప్ చేశారు. ఆ తర్వాత రెండో విడతలో మరో 800 మెగావాట్ల మూడు యూనిట్లతో 24,00 మెగా వాట్లు ఉత్పత్తి చేయనున్నారు. మొత్తంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4,000 మెగావాట్ల కెపాసిటీతో యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటైంది.