తెలంగాణలో కొత్తగా 2932 కేసులు నమోదు

మొత్తం కేసుల సంఖ్య 1,17,415

corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా బీభత్సం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 2932 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మరణించారు. 1580 మంది డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 520 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 17,415కి చేరింది. 87,675 కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 799 మంది చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో 28,941 యాక్టివ్ కేసులున్నాయి. 22,097 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. మరో 771 రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 61,863 శాంపిల్స్ పరీక్షించారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,04,343 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/