12న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమలః వచ్చే సంవత్సరం జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఎల్లుండి విడుదల కానున్నాయి. 12 న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ బోర్డు విడుదల చేయనున్నది. అదేవిధంగా, 2023 జనవరి నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ద్వారా అదేరోజు ఉదయం 10 గంటల నుంచి డిసెంబరు 14న ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తరువాత లక్కీడిప్‌లో టికెట్లు కేటాయిస్తారు. భక్తులు ఈ విషయాలను గుర్తించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ బోర్డు విజ్ఞప్తి చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/